మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు 8 మంది దాకా హీరోలుగా ఇండస్ట్రీలో ఉన్నారు.ఇప్పటికి వాళ్లలో కొంతమంది మాత్రమే సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నారు.
ముఖ్యంగా సార్ హీరోలైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లని మినహాయిస్తే ఇక కుర్ర హీరోలు అయినా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవి తేజ్ ముగ్గురు కూడా వరుస సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే వీళ్లంతా కూడా డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు.ఇక సాయి ధరమ్ తేజ్ ఈ ఇయర్ విరూపాక్ష ( Virupaksha )అనే సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు.అలాగే వైష్ణవి తేజ్( Vaishnav Tej ) కూడా తన మొదటి సినిమా సినిమాతోనే బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవ దారి అర్జున సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.దాంతో ఆయన ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాలు ఒప్పుకున్నవి పూర్తి చేసే పనిలో పడ్డాడు.
ఎందుకంటే వరుణ్ తేజ్ కి , లావణ్య త్రిపాఠి కి మధ్య నవంబర్ నెలలో పెళ్లి జరగబోతుంది.

కాబట్టి ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలని ఫినిష్ చేసి పెళ్లి తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో నటించనున్నట్లు గా తెలుస్తుంది.అందుకే ఆయన ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు మాత్రమే ఫినిష్ చేస్తున్నాడు ఇక ఈ ముగ్గురు హీరోల్లో ఎవరికి స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది అని అంటే వైష్ణవి తేజ్( Vaishnav Tej ) కి స్టార్ హీరో అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఆయనకి యాక్టింగ్ పరంగా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లని ఎంచుకుంటున్నాడు.
అలాగే ఆయన చూడటానికి కూడా చాలా బాగుంటాడు.ఇక యాక్టింగ్ కూడా బాగా చేస్తూ చాలా వరకు ప్రేక్షకులను మెప్పిస్తు ఉంటాడు.
అందువల్ల మెగా ఫ్యామిలీలో ఆ హీరోకి స్టార్ హీరో అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి…
.