ఈ మధ్యకాలంలో సన్ ఫ్లవర్ సీడ్స్( Sunflower Seeds ) బాగా ప్రాచుర్యం పొందాయి.ఒకప్పుడు చాలా అరుదుగా ఈ గింజలు లభించేవి.
కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఇవి చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.ఈ మధ్య మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలామంది ప్రతిరోజూ సన్ ఫ్లవర్ సీడ్స్ ఉపయోగిస్తున్నారు.
ఈ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అలాగే సన్ ఫ్లవర్ సీడ్స్ లో చర్మ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అయితే మనలో చాలామందికి ఈ విషయం తెలియదు.సన్ ఫ్లవర్ గింజలు చర్మం మీద మృత చర్మకణాలు తొలగించి, చర్మం కాంతివంతంగా మెరవడానికి, అలాగే ముడుతలు తగ్గడానికి, మొటిమలు, నల్లని మచ్చలను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

దీనికోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే పోయి మీద పాన్ పెట్టి సన్ ఫ్లవర్ సీడ్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకుని సీసాలో నిల్వ చేసుకోవచ్చు.ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ పొడి, అర స్పూన్ కొబ్బరి పొడి, జాజికాయ( Nutmeg ) పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలపాలి.
ఆ తర్వాత సరిపడా కొబ్బరి పాల( Coconut milk )ను వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఒక గంట అలాగే వదిలేయాలి.ఆ తర్వాత ఈ పేస్టు మొఖానికి రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి.ముఖం తెల్లగా అందంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.అలాగే వేల కొద్ది డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు, ముడతలు లాంటి అన్ని రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.