హను రాఘవపూడి సినిమా కి ఆ హీరో ఒకే అయినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో హను రాఘవపూడి ( Hanu raghavapudi )ఒకరు.ఈయన చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర చాలా సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి మంచి గుర్తింపు పొందిన తర్వాత ఆయన కూడా అందాల రాక్షసి అనే సినిమాతో డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Hanu Raghavapudi And Vijay Deverakonda Movie Details , Hanu Raghavapudi , Toll-TeluguStop.com

ఇక దానితో మొదటి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ రెండవ సినిమాగా నాని ని హీరోగా పెట్టి కృష్ణగాడి వీర ప్రేమ గాధ( Krishna Gaadi Veera Prema Gaadha ) అనే సినిమాని తిరకెక్కించాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Dulquer Salmaan, Krishnagaadi, Mrunal Thakur, Sita Ramam, Tollywood-Telug

ఇక దాంతో తన తదుపరి చిత్రంగా నితిన్ ని హీరోగా పెట్టి లై అనే సినిమా తీశాడు.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు.ఇక దాని తర్వాత చేయబోయే సినిమా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో శర్వానంద్ ను పెట్టి పడి పడి లేచే మనసు అనే సినిమా తీసినప్పటికీ ఈ సినిమా సెకండ్ హాఫ్ తేడా కొట్టడంతో సినిమా ఫ్లాప్ అయింది.

 Hanu Raghavapudi And Vijay Deverakonda Movie Details , Hanu Raghavapudi , Toll-TeluguStop.com

ఇక కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న ఈయన దుల్కర్ సల్మాన్ ని హీరోగా పెట్టి తీసిన సీతారామం సినిమా( Sita Ramam ) పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అయింది.ఇక ప్రస్తుతం ఈయన ఒక స్టార్ హీరో ని పెట్టి తెలుగులోనే తన నెక్స్ట్ తదుపరి చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Dulquer Salmaan, Krishnagaadi, Mrunal Thakur, Sita Ramam, Tollywood-Telug

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈయన తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తో చేసే అవకాశం అయితే ఉంది అని సినీ ప్రముఖులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరుశురాం డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అలాగే గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు మినహాయిస్తే ఇక ఆయన చేతిలో ఏ సినిమాలు లేవు కాబట్టి హను రాఘవపూడి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో సినిమా చేయడం తనకి ఇప్పుడు బెటర్ ఆప్షన్ అనే అభిప్రాయంలో విజయ్ దేవరకొండ ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube