యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది.
ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల శివ భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నారు.అయితే దేవర సినిమాతో తనపై పడినటువంటి ఈ డిజాస్టర్ మార్క్ తొలగిపోవాలన్న కసితోనే ఈయన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా సముద్రపు బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

మత్సకార( Fishermen ) గ్రామం చుట్టూ తిరిగే కథ.జాలరి యువకుడి పాత్రలో టైగర్ నటిస్తున్నాడు.తీర ప్రాంతం సెట్ కోసం ప్రత్యేకంగా బీచ్ సెట్ ని రూపోందించారు.
సాబు సిరిల్( Sabu Cyril ) ఆధ్వర్యంలో ఈ బీచ్ సెట్ వేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సెట్ నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఇసుక రాళ్ళను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ బీచ్ చూడటానికి ఒక సెట్ లా కాకుండా నిజంగానే బీచ్ ను తలపించేలా సహజసిద్ధంగా రూపొందించబోతున్నారట.ఇక ఈ సెట్ కోసం కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ఇసుకను బండ రాళ్ళను తరలిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే భారీ స్థాయిలో సముద్రపు గర్భంలో ఒక యాక్షన్ సన్నివేశాన్ని( Action Scene ) చిత్రీకరించారని తాజాగా మరొక యాక్షన్ సన్నీ వేషాన్ని చిత్రీకరించడం కోసమే ఈ విధమైనటువంటి బీచ్ సెట్టింగ్ వేస్తున్నారని తెలుస్తుంది.ఇలా ప్రతి ఒక్క యాక్షన్స్ సన్ని వేషంలోనూ అలాగే ప్రతి ఒక్క సీన్ విషయంలోనూ కొరటాల( Koratala Siva ) ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికే రాజమౌళి సినిమాలో నటించిన హీరోలకు తదుపరి సినిమా డిజాస్టర్ అనే సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది అయితే ఎన్టీఆర్ ఈసారి ఈ సెంటిమెంటును బ్రేక్ చేయాలని ఎంతో కష్టపడుతున్నారట అలాగే ఆచార్య సినిమా ద్వారా డిజాస్టర్ మార్క్ వేసుకున్నటువంటి కొరటాలు కూడా ఈ డిజాస్టర్ మార్కు తొలగించుకోవడం కోసం పనిచేస్తున్నారని ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.