Bigg Boss 7: బిగ్ బాస్ ఇక చాలు… నీ ఉల్టా పుల్టా గేములు ఆపు.. చూడటం మా వల్ల కావడం లేదు..!

బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) కూడా ఇంతకు ముందు సీజన్స్ లాగానే చెప్పగానే సాగుతుంది అసలు పేరే ఉల్టా పుల్ట అని పెట్టుకొని టాస్కులు కూడా ఉల్టా పల్టా ఆడిస్తూ జనాల మైండ్ దొబ్బేస్తున్నారు.వచ్చిందే 14 మంది అందులో ఇద్దరిని బయటకు పంపించేశారు.

 Worst Rating For Bigg Boss Season 7-TeluguStop.com

అసలు వీరు కంటెస్టెంట్ లు కాదు.జస్ట్ కంటెండర్లు మాత్రమే.

అంటే వట్టి అనామకులు అన్నమాటం ఇందులోంచి ఇద్దరిని మాత్రమే హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ చేశారు.ఇక బిగ్ బాస్ దత్త పుత్రుడు శివాజీ( Sivaji ) ఎలాగూ సేఫ్ గానే ఉంటాడు.

సందీప్( Sandeep ) సైతం మంచి ఆటగాడు కాబట్టి టఫ్ ఫైటర్ అని చెప్పవచ్చు.అయితే ఇంకా ఐదు లేదా ఆరుగురు మధ్యలో వచ్చి దూరే అవకాశం ఉంది.

Telugu Bigg Boss, Bigg Boss Games, Biggboss, Gautam, Sandeep, Sivaji, Sobha Shet

వారి ఆట వారి ఇష్టం … ఎవరినైనా తీసుక రావచ్చు తీసుకుపోవచ్చు.కానీ ఆడే ఆటలో అయినా కాస్త పద్ధతి ఉండాలి.పెట్టే గేమ్స్ ని కొంచెం జనాలకు దొరకకుండా తెలివిగా పెట్టగలిగితే ఎవరూ వేలేత్తి చూపరు.ఉదాహరణకు నిన్న శోభా శెట్టిని( Sobha Shetty ) కంటెండర్ గా చేసే ఒక టాస్క్ పెట్టాడు ఆమని ఆక్టివిటీ రూమ్ లోకి పిలిచి ఆమె ముందు కారంగా చేసినా చికెన్ ముక్కలు( Chicken ) పెట్టి తినమన్నాడు.

ఆమె ముక్కు చీదుతూ మూతి తుడుచుకుంటూ 27 ముక్కలు తింది.ఇక ఆమె తర్వాత మరికొంత మందిని పిలిచి ఆమె కన్నా ఎక్కువగా తినే వారిని విజేతగా ప్రకటిస్తానని చెప్పారు బిగ్ బాస్.

Telugu Bigg Boss, Bigg Boss Games, Biggboss, Gautam, Sandeep, Sivaji, Sobha Shet

అయితే సందీప్ సంచాలక్ గా ఈ పోటీ మొదలయ్యింది.ముందు గౌతమ్( Gautam ) విజేత అని ప్రకటించాడు.మళ్ళీ ఏమైందో ఏమో ఒక ముక్క సగం తిన్నావు కాబట్టి విజేత కాదు శోభనే గెలిచింది అంటూ ప్రకటించాడు.మొదట శోభను యాక్టివిటీ రూమ్ కి పిలిపించి ఆమెకు తగినంత సమయం ఇచ్చి ఆడించడం ఒక ఎత్తు అయితే వేగంగా తిన్న మిగతా వారితో పోల్చడం ఇదేం లాజిక్కో జనాలకు అర్థం కాలేదు.

ఇలా పిచ్చిపిచ్చి గేమ్స్ పెట్టి జనాల బుర్రను తినేసే బదులు తెలివిగా ఏవైనా ఆటలాడించి షో టీఆర్పీ పెంచుకోవచ్చు కదా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.సీజన్ ఉల్టా పుల్టా అని పెట్టుకున్న కారణంగా ఆటలు కూడా పిచ్చిపిచ్చిగా ఆడతానంటే ఎలా చెప్పు బిగ్ బాస్ కాస్త తెలివిగా ప్రవర్తించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube