తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది.ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై సుమారు ఐదు గంటల పాటు కసరత్తు కొనసాగగా గత మూడు రోజులుగా ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై నేతలు తీవ్ర కసరత్తు చేశారు.
సర్వేలు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలతో పాటు ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థులను వడపోశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే 70 కి పైగా స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు సమాచారం.
ఈ మేరకు తొలి విడత అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన స్క్రీనింగ్ కమిటీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేసింది.ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.
అభ్యర్థుల జాబితా సిద్దం అయిన తరువాత ఏఐసీసీ ప్రకటించనుంది.