కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ( Vijay Antony ) కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ అంటే అందరికి పరిచయమే.
నటుడిగా, డైరెక్టర్ గా, నిర్మాతగా అన్ని రకాలుగా విజయ్ అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
మరి అలాంటి స్టార్ హీరో ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది.ఈయన కూతురు మీరా( Meera ) ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.ఈయన కుటుంబం మాత్రమే కాదు కోలీవుడ్ ఇండస్ట్రీ( Kollywood Industry ) మొత్తం ఈమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.16 సంవత్సరాల మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచి వేస్తుంది.ఒత్తిడి కారణంగానే ఈమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.
కుమార్తె ఆత్మహత్యతో విజయ్ కృంగిపోయాడు.తొలిసారి ఈయన సోషల్ మీడియా( Social media ) వేదికగా పోస్ట్ చేసారు.తన కుమార్తెతో పాటు తాను కూడా మరణించానని ఈయన చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.”మా కూతురు మీరా అప్పుడు ఎంతో దైర్యంగా, ప్రేమగా ఉంటుంది.మతం, డబ్బు, అసూయా, బాధ, కులం, ద్వేషం వంటివి ఏమీ లేని చోటుకు వెళ్ళిపోయింది.
ఈ ప్రపంచం కంటే ప్రశాంతమైన, మెరుగైన ప్రదేశానికి వెళ్ళిపోయింది.నా కూతురుతో పాటే నేను చనిపోయాను.ముందు ముందు నేను చేయబోయే ప్రతీ సేవ కార్యక్రమాన్ని కూడా తన పేరుతోనే స్టార్ట్ చేస్తాను అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.
విజయ్ ఆంటోనీ,( Vijay Antony ) ఫాతిమాలకు 2006లో పెళ్లి జరుగగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పెద్ద కూతురు మీరా, చిన్న కూతురు లారా.