ఎన్నికలున్నాయనే బీజేపీ కొత్త ఎత్తుగడలు..: మంత్రి కేటీఆర్

రజాకార్ సినిమా టీజర్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు.

 Bjp's New Moves Because Of Elections..: Minister Ktr-TeluguStop.com

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.కర్ణాటక ఎన్నికల్లో కేరళ స్టోరీని దింపిందన్నారు.

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముస్లింలను టార్గెట్ చేస్తూ రజాకార్ సినిమా తీసిందని విమర్శించారు.అయితే తెలంగాణ విమోచనం నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు, రజాకార్ల దాష్టికాన్ని తెలియజేసే కథనంతో రజాకార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ టీజర్ లో తెలంగాణ ప్రజలపై రజాకార్ల చేసిన దారుణ ఘటనలు చూపించింది.దీంతో ఈ సినిమా టీజర్ రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube