ఎన్నికలున్నాయనే బీజేపీ కొత్త ఎత్తుగడలు..: మంత్రి కేటీఆర్

రజాకార్ సినిమా టీజర్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో కేరళ స్టోరీని దింపిందన్నారు.ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ముస్లింలను టార్గెట్ చేస్తూ రజాకార్ సినిమా తీసిందని విమర్శించారు.

అయితే తెలంగాణ విమోచనం నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటనలు, రజాకార్ల దాష్టికాన్ని తెలియజేసే కథనంతో రజాకార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ టీజర్ లో తెలంగాణ ప్రజలపై రజాకార్ల చేసిన దారుణ ఘటనలు చూపించింది.

దీంతో ఈ సినిమా టీజర్ రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది.

మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!