హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సీఏ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
ఈ మేరకు హెచ్ సీఏ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.అయితే హెచ్ సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు ఏకసభ్య కమీషన్ ఆధ్వర్యంలోనే ఎలక్షన్ జరగాలని సుప్రీం తెలిపింది.
అసోసియేషన్ గుర్తింపుతో పాటు పలు అంశాలపై హెచ్ సీఏ, షాద్ నగర్ క్రికెట్ అసోసియేషన్, అజారుద్దీన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.