తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రం వాళ్ల సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు అలాంటివారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో భారీ హిట్టు కొట్టడానికి మన ముందుకు వస్తున్న సుకుమార్ కూడా ఒక మంచి డైరెక్టర్ అని చెప్పాలి.
ఈయన గతంలో చేసిన ఆర్య , 100% లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాయి.ఇక ఇంతకుముందు అల్లు అర్జున్( Allu arjun ) తో ఆయన చేసిన పుష్ప సినిమా ఇండియా వైస్ గా రిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించింది.
ఇక ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఇక ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమా మీద చాలా మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని కూడా రూపొందిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ అయితే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ కోసం ఒక స్టార్ హీరోని సంప్రదించినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర ఆయన చేత చేయించాలని ఇప్పటికే దర్శకుడు అతనితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందిన కార్తీ( Karthi ) అని తెలుస్తుంది.ఒక క్యారెక్టర్ కోసం సుకుమార్ పుష్ప 2 లో ఆయన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవడంతో ఆ క్యారెక్టర్ ని బయటకు చెప్పకుండా జాగ్రత్తగా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ కు ముందు ఈ విషయాన్ని చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే సినిమాలో క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందని అది కూడా సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ కావడం ఆ క్యారెక్టర్ కి కార్తి అయితే సరిగ్గా సరిపోతాడు అనుకొని ఆయన్ని సంప్రదించారు…

ఇక ఈ స్టోరీ బాగా నచ్చడంతో కార్తీ కూడా వెంటనే ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.కార్తీ లాంటి హీరో ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన కూడా సినిమాకి తమిళ్ మార్కెట్ పరంగా కూడా బాగా హెల్ప్ అవుతుంది.అందుకే ఆయన చేత ఆ క్యారెక్టర్ ని చేయిస్తున్నారు సుకుమార్.
ఈ సినిమా కోసం జనాలు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు ఇక ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో బిజీగా ఉన్న ఈ లెక్కల మాస్టారు ఈ సినిమాతో మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నట్టు గా తెలుస్తుంది ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి….