RRR : ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు.. రాజమౌళి స్పందన ఇదే?

ప్రస్తుతం భారత్ లో జీ20 సమ్మిట్( G20 Summit ) జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.అందులో భాగంగానే తాజాగా ఈ సమ్మిట్ లో పాల్గొనడం కోసం బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సాల్వా( Brazil president Luiz Inacio Lula da Silva ) హాజరయ్యారు.

 Brazil President Luiz Inacio Lula Da Silva Praises Rrr Movie-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్నో ఫన్నీ సీన్ లు ఉన్నాయి.మూడు గంటల ఫీచర్ ఫిల్మ్, అందులో డ్యాన్సులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

బ్రిటీష్ వాళ్లు ఇండియాను ఎలా ఆక్రమించుకోవాలని అనుకున్నారో అందులో చూపించారు.

ప్రతీ ఒక్కరూ నన్ను ఆర్ఆర్ఆర్ సినిమా( RRR )ను చూశావా? అని అడుగుతుండేవారు.ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూశారు.అలాంటి మంచి చిత్రాన్ని తీసిన టీంకు ఆల్ ది బెస్ట్ అని బ్రెజిల్ అధ్యక్షుడు తెలిపారు.

బ్రెజిల్ అధ్యక్షుడు మాటలకు దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) స్పందిస్తూ దండం పెట్టే ఎమోజిని షేర్ చేశారు.మీ మాటలకు, మీరు వర్ణించిన తీరుకు థాంక్స్ సర్ అని అన్నాడు.

ఇండియన్ సినిమా గురించి మాట్లాడటం, ఆర్ఆర్ఆర్ గురించి చెప్పడం ఆనందంగా ఉంది అని తెలిపాడు.మీ మాటలతో మా టీం ఉబ్బితబ్బిబైపోతోంది.ఇండియాలో ఉన్న ఈ టైంను మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామంటూ రాజమౌళి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజమౌళి చేసిన ట్వీట్( Rajamouli Tweet ) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ ను సాధించింది.అంతేకాకుండా చెర్రీ, తారక్ లను గోబల్ స్టార్ లుగా మార్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube