తెలుగు యూట్యూబర్స్ లో ఆరంభం లో మంచి పేరు తెచ్చుకున్న వారు దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ జశ్వంత్.( Shanmukh Jaswanth ) వీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో చేసిన సిరీస్ లు ఇంకా మ్యూజిక్ ఆల్బమ్స్ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
బిగ్ బాస్ లో కూడా వీరిద్దరికి ప్రేమ కారణంగానే ఆఫర్ వచ్చింది అనడం లో సందేహం లేదు.హీరోయిన్ గా దీప్తి సునైనా( Deepthi sunaina ) నటించేంత క్రేజ్ ను సొంతం చేసుకుంది.
షన్నూ కూడా యూట్యూబ్ లో సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.
అలాంటి ఈ జంట బిగ్ బాస్( Biggboss ) వల్లే విడి పోయారు అనేది కొందరి మాట.ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరు కెరీర్ పరంగా ఇబ్బందు లు ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.అసలు ఇద్దరికి ఇద్దరు కూడా ప్రస్తుతం పెద్ద పెద్ద ఆఫర్లు ఏమీ లేవు.
ముఖ్యంగా దీప్తి సునైన ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ మధ్య ఇద్దరు కలిసి పోయారు, ఇద్దరు మళ్లీ కలిసి షో లు మొదలు పెట్టబోతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
కానీ అవన్నీ కూడా గాలి వార్తలే అని తేలిపోయింది.
యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఇద్దరు కూడా ఇప్పుడు అదే యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను విడి విడిగా అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ వర్కౌట్ అవ్వడం లేదు.ఇప్పటి వరకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని కూడా వీరిద్దరు క్యాష్ చేసుకోలేక పోయారు.
ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో విడి విడిగా పాల్గొన్నారు.కానీ ఏ ఒక్కటి కూడా వీరికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
ఇద్దరు కలిసి ఉంటే కెరీర్ జిల్ జిల్ జిగా అన్నట్లుగా ఉండేది.