సినిమా ఇండస్ట్రీలో ప్రేమ,పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు అనేవి చాలా సింపుల్ గా తీసుకుంటారు ఇండస్ట్రీలో ఉండే చాలామంది జనాలు.అలా ఇప్పటికే ఎంతోమంది ప్రేమించుకున్న కొన్నిరోజులకే విడిపోవడం, పెళ్లి చేసుకున్న రెండు మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం వంటివి మనం ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా చూశాం.
చిన్న చిన్న కారణాల వల్ల పెళ్లయిన జంటలు విడిపోవడం చూసి ఎంతోమంది అభిమానులు బాధపడుతూ ఉంటారు.అయితే కోలీవుడ్లో నయనతార శింబు( Nayanatara-Shimbu ) ప్రేమాయణం తర్వాత హన్సికతో శింబు లవ్ ట్రాక్ నడిపారు.
వీరి ప్రేమ చాలా రోజులు సాగింది.పెళ్లి చేసుకుంటారు అనే టాక్ కూడా కోలీవుడ్ మీడియా ( Kollywood media ) లో వినిపించింది.అయితే వీరి ప్రేమ వార్తలను వీరు కొట్టి పడేయకుండా వీరి మధ్య ఉండే ప్రేమ నిజమే అని క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంటామని అందరికీ హింట్ ఇచ్చారు.
కానీ ఉన్నట్టుండి వీరి మధ్య ప్రేమ బంధం తెగిపోయింది.ఇక వీరి మధ్య ప్రేమ చెడిపోవడానికి కారణం రక రకాల ఊహగానలు తెరపై చక్కర్లు కొట్టాయి.
అయితే అలాంటిదే ఇప్పుడు ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అంతేకాదు ఈ జంట విడిపోవడానికి కారణం ఆ హీరోనే అంటూ ఒక వార్త కూడా వైరల్ అవ్వడంతో ఆ హీరో ఎవరబ్బా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే.శింబు హన్సిక ( Shimbu-Hansika ) ప్రేమించుకున్న తర్వాత కూడా హన్సిక చాలా సినిమాల్లో నటించింది.
అలా ok ok సినిమాలో ఉదయనిధి( Udayanidhi ) తో కలిసి హన్సిక నటిస్తున్న టైంలో ఒక రూమర్ క్రియేట్ చేశారు ఉదయనిధి అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్లు.అదే ఉదయినిధి కి హన్సికకి మధ్య ఎఫైర్.అయితే ఇందులో ఎలాంటి నిజం లేకపోయినప్పటికీ ఈ వార్తను బాగా వైరల్ చేయడంతో చాలామంది నిజమే అని భావించారు.ఇక ఈ వార్తలకు కొట్టి పారేయకుండా ఉదయనిధి హన్సిక వరుసగా సినిమాల్లో చేసేసరికి ఈ వార్త కాస్త శింబు చెవిన పడిందట.
దాంతో ఈ విషయం సహించలేని శింబు (Shimbu) నేరుగా హన్సికని ఈ విషయం గురించి ఆరా తీయగా అలాంటిదేమీ లేదు అని హన్సిక చెప్పినప్పటికీ వినకుండా శింబు ఆమెను తిట్టి ఈ విషయంలో చేయి కూడా చేసుకున్నారట.దాంతో శింబు పెట్టే టార్చర్ భరించలేక హన్సిక( Hansika ) అతనితో బ్రేకప్ చేసుకొని చివరికి చెన్నై నుండి ముంబైకి పయనమయింది.
ఆ తర్వాత బిజినెస్ మాన్ ని గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.