బి‌ఆర్‌ఎస్ గ్రూప్ పాలిటిక్స్.. ఆ టికెట్ ఎవరికోమరి ?

గత నెలలో బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ) మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొంది.దాదాపుగా మెజారిటీ స్థానాలను సిట్టింగ్ లకే కేటాయించడంతో కొత్తగా సీటు ఆశించిన వారు, ఇతర పార్టీల నుంచి బి‌ఆర్‌ఎస్ లో చేరిన వారు తీవ్రంగా భంగపాటుకు గురవుతున్నారు.

 Brs Group Politics.. Whose Ticket Is It , Brs Party , Bjp Party , Congress-TeluguStop.com

ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు జంపింగ్ జపాంగ్ కు తెరతీసి ఇతర పార్టీలోకి వెళ్ళేందుకు మార్గం వెత్తుకుంటున్నారు.ఇదిలా ఉంచితే 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ మరో నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు, అలా పెండింగ్ లో ఉన్న స్థానాలలో జనగామ ఒకటి.

ప్రస్తుతం ఈ సీటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు కొంతమంది నేతలు.

Telugu Cm Kcr, Congress, Muthiyadagiri, Pallarajeshwar-Politics

జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డి( muthireddy yadagiri reddy ) సీటు ఆశించినప్పటికి తన పేరు ప్రకటించకపోవడంతో నైరస్యానికి లోనయ్యారు.ఇంతకీ ఈ సీటును ఎందుకు హోల్డ్ లో పెట్టినట్లు అంటే.ఈ సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డి తో అటు పల్లా రాజేశ్వర రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు.

వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ గ్రూప్ రాజకీయాలకు తెర తీస్తున్నారు.దీంతో పరిశీలన కోసం కే‌సి‌ఆర్ ఈ సీటును పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. నియోజిక వర్గంలో అంతర్గత సర్వేల తరువాత వడపోత చేపట్టి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Telugu Cm Kcr, Congress, Muthiyadagiri, Pallarajeshwar-Politics

అయితే సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేనప్పటికి.సీటు మాదంటే మాదంటూ నేతలు గ్రూప్ రాజకీయాలను మొదలు పెట్టారు.దీంతో జనగామపై వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్( KTR ) స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక్కడ ఎవరు పోటీ చేయాలనే దానిపై అధినేత కే‌సి‌ఆర్ ప్రకటించే వరకు ఎవరు ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని కే‌టి‌ఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట.దీంతో ప్రస్తుతం నేయోజిక వర్గంలో నేతలంతా సైలెన్స్ వ్యవహరిస్తున్నారు.

అయితే ప్రస్తుతం జనగామ టికెట్ కోసం ముట్టిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి( Palla Rajeshwar Reddy ) గట్టిగా పోటీ పడుతుండడంతో ఎవరికి సీటు ఇచ్చిన.ఇంకొక్కరి రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరి గులాబీ బాస్ ఎవరిని రేస్ లో నిలుపుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube