'జవాన్'తో క్లారిటీ ఇవ్వనున్న పుష్పరాజ్.. హిట్ అయితే నెక్స్ట్ అట్లీతోనే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) పఠాన్ హిట్ తర్వాత మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

 Atlee For Allu Arjun Next, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukumar, Trivi-TeluguStop.com

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”( Jawan ).ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

Telugu Allu Arjun, Atlee Kumar, Jawan, Pushpa, Pushpa Rule, Sandeepreddy, Sukuma

దీంతో ఈ సినిమా మీద అంతా నమ్మకంతో ఉన్నారు.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా రిజల్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.అందరి కంటే ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఈ సినిమాపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన సినిమాల సెలెక్షన్ లో మార్పు కనిపిస్తుంది.ఏది బడితే అది కాకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా( Pushpa 2 ) చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ఆ తర్వాత కూడా లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.

పుష్ప ది రూల్ తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

Telugu Allu Arjun, Atlee Kumar, Jawan, Pushpa, Pushpa Rule, Sandeepreddy, Sukuma

అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఒకటి కాగా మరొకటి సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఈ రెండు సినిమాలు ఇప్పటికే అఫిషియల్ అప్డేట్స్ వచ్చాయి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

అట్లీ కూడా టాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.కానీ ఏవీ సెట్ అవ్వడం లేదు.
ఈ క్రమంలోనే అట్లీ( Director Atlee ) గత కొద్దీ రోజుల క్రితం అల్లు అర్జున్ కు కథ చెప్పాడని టాక్.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ జవాన్ రిజల్ట్ చూసిన తర్వాత ఓకే చెప్పాలా వద్దా అనేది ఆలోచించుకోనున్నారట.

జవాన్ హిట్ అయితే ఈ కాంబో తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే జవాన్ టాక్ చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేలానే ఉంది.మరి అల్లు అర్జున్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube