‘జవాన్’తో క్లారిటీ ఇవ్వనున్న పుష్పరాజ్.. హిట్ అయితే నెక్స్ట్ అట్లీతోనే..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) పఠాన్ హిట్ తర్వాత మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ''జవాన్''( Jawan ).

ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. """/"/ దీంతో ఈ సినిమా మీద అంతా నమ్మకంతో ఉన్నారు.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా రిజల్ట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

అందరి కంటే ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఈ సినిమాపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన సినిమాల సెలెక్షన్ లో మార్పు కనిపిస్తుంది.

ఏది బడితే అది కాకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా( Pushpa 2 ) చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇక ఆ తర్వాత కూడా లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.పుష్ప ది రూల్ తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

"""/"/ అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఒకటి కాగా మరొకటి సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఈ రెండు సినిమాలు ఇప్పటికే అఫిషియల్ అప్డేట్స్ వచ్చాయి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

అట్లీ కూడా టాలీవుడ్ హీరోలతో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.కానీ ఏవీ సెట్ అవ్వడం లేదు.

ఈ క్రమంలోనే అట్లీ( Director Atlee ) గత కొద్దీ రోజుల క్రితం అల్లు అర్జున్ కు కథ చెప్పాడని టాక్.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ జవాన్ రిజల్ట్ చూసిన తర్వాత ఓకే చెప్పాలా వద్దా అనేది ఆలోచించుకోనున్నారట.

జవాన్ హిట్ అయితే ఈ కాంబో తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటికే జవాన్ టాక్ చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేలానే ఉంది.

మరి అల్లు అర్జున్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?