ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ). ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది.స్టార్ట్ చేయడంలో ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ కు పెద్దగా గ్యాప్ లేకుండా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసారు.ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్స్( Saif Ali Khan Devara Look ) రిలీజ్ అవ్వగా ఈ ఫస్ట్ లుక్ లతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఈసారి తారక్ తో కొరటాల యదార్ధ సంఘటనల ఆధారంగా మూవీ చేస్తున్నాడు.దళితులు అగ్రవర్ణాల మధ్య జరిగే స్టోరీ అని టాక్.
ఇదిలా ఉండగా ఈ సినిమా సముద్ర నేపథ్యంలో అని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్( NTR Devara Look ) తోనే అర్ధం అయ్యింది.ఎన్టీఆర్ మత్సకారుడిగా నటిస్తున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో షిప్ ఫైట్ ను కొరటాల పూర్తి చేసాడు.
ఇక ఇప్పుడు కూడా మరో భారీ యాక్షన్ సెంవెన్స్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యారట.
ఈ సీక్వెన్స్ పూర్తిగా వాటర్ లోనే జరుగుతుండగా యాక్షన్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్( Action Choreographer King Solomon ) ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేసారని ఏకంగా 20 రోజుల పాటు ఎన్టీఆర్ దేవర కోసం వాటర్ లోనే ఎక్కువ సమయం కేటాయించనున్నారని తెలుస్తుంది.ఈ ఫైట్ సీన్( Devara Fight Scenes ) 20 రోజుల పాటు ఏకధాటిగా సిద్ధం చేయనున్నారని ఇందుకోసం తారక్ మూడు రోజులు శిక్షణ కూడా తీసుకున్నాడట.నవంబర్ చివరికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలనీ కొరటాల ప్లాన్.
చూడాలి మరి అనుకున్న సమయానికి పూర్తి అవుతుందో లేదో.