పండ్ల తోటలను ఆశించే చీడపీడలను నివారించే మెరుగైన పద్ధతులు..!

చీడపీడలు( Pests ) ఆశించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ చాలా తక్కువ.పురుగు ఆశించని కాయలకే మంచి ధర వస్తుంది.

 Better Methods Of Preventing Orchard Pests , Nut Cavity, Fly, Tenka Worm, Orchar-TeluguStop.com

కాబట్టి పండ్ల తోటలను( Orchards ) చీడపీడల నుండి రక్షించుకోవడంలో పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.ముందుగా కాయలపై తల్లి ఈగలు గుడ్లను పెడతాయి.

ఆ తర్వాత వీటిలో నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాయ లోపలికి వెళ్లి గుజ్జును తినడం వల్ల కాయ కుళ్ళిపోయి రాలిపోతుంది.ఈ రాలిపోయిన కాయలో ఉండే లార్వాలు భూమిలోకి వెళ్లి కోసస్థ దశలొకి వెళ్తాయి.

Telugu Agriculture, Dimethomet, Eczema Mites, Latest Telugu, Nut Cavity, Orchard

కాబట్టి పురుగు ఆశించిన, నేల రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరివేసి నాశనం చేయాలి.కాయ పుచ్చు, ఈగ, టెంక పురుగు ఆశించిన చెట్ల మొదల చుట్టూ చెట్ల కింద భూమిని మండువేసవికాలంలో లోతుగా కలియదున్నాలి.ఈ పురుగుల ఉనికిని గుర్తించిన వెంటనే రెండు మిల్లీలీటర్ల డైమిథోమెట్( Dimethomet ) ను ఒక లీటరు నీటిలో కలిపి రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి.ఆకు గూడు పురుగులు పండ్ల తోటలను ఆశిస్తే వెంటనే ఈ పురుగుల గూళ్లను నాశనం చేసి రెండు మిల్లీమీటర్ల రోగార్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Dimethomet, Eczema Mites, Latest Telugu, Nut Cavity, Orchard

తామర పురుగులు( Eczema mites ) పండ్ల తోటలను ఆశిస్తే వెంటనే రెండు మిల్లీలీటర్ల మెటా సిక్స్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.పిండి పురుగులు పండ్ల తోటలను ఆశిస్తే.చెట్టు పాదులలో లిండేన్ లేదా కార్బారిల్ పొడి లేదా ఫోరెట్ గుళికలు వేసి నీటి తడి అందించాలి.ఇక రెండు మిల్లీలీటర్ల మెటాసిస్టాక్స్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగుళ్లు పంటను ఆశించినట్లయితే ఒక మి.లీ కారథేన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.మచ్చ తెగులు పంటను ఆశించినట్లయితే 2.5 గ్రాముల ఎం.45 ను ఒక లీటరు నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube