Urvashi Rautela : నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. దేశంలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునేది ఈమె మాత్రమేనా?

ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ). సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 Urvashi Rautela Talked About Being Highest Paid Actress Country-TeluguStop.com

తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఈ ముoద్దుగుమ్మ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ( Waltair Veeraiah )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.అంతే కాకుండా ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.

ఈ మూవీ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్‌ చిత్రం( Agent Movie )లోనూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది.ఇటీవలే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఈఫిట్ టవర్‌ను వన్డే వరల్డ్‌ కప్‌ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది.ఇలాంటి ‍అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈమె పారితోషకంకి సంబంధించి అనగనగాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఆ వివరాల్లోకి వెళితే.ఆమె ఒక్కో సినిమాకు గాను నిమిషానికి రూ.కోటి రూపాయల రెమ్యునరేషన్‌( Urvashi Rautela Remuneration ) వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి.

అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.మీరు ఒక నిమిషానికి రూ.కోటి రూపాయలు వసూలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అని ప్రశ్నించగా.ఆ విషయంపై ఆమె స్పందిస్తూ.

నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఊర్వశి రౌతేలా సినిమాల విషయానికొస్తే.

ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్‌లతో కలిసి దిల్ హై గ్రేలో( Dil Hai Gray ) నటించనుంది.అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది ఈ బ్యూటి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube