తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ కారు భద్రాచలం వస్తుంది కానీ రాముల వారి వద్దకు వెళ్లదని చెప్పారు.
దీనికి కారణం కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉండటమేనని విమర్శించారు.తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న అమిత్ షా ఈ సారి భద్రాద్రి రాముల వారి వద్దకు వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ పెద్ద నేతగా ఎదుగుతున్నారనే విధానసభ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.వారసత్వ పాలనను కొనసాగిస్తూ కేటీఆర్ ను సీఎంను చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారన్నారు.
కానీ ప్రధాన మంత్రి మోదీ ఆశీస్సులతో బీజేపీ నేత తెలంగాణ సీఎం అవుతారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.