సీఎం కెసిఆర్ నాయకత్వంలో ఆకుపచ్చ రాష్ట్రంగా తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవంలో భాగంగా శనివారం వేములవాడ మండలం చంద్రగిరి గ్రామంలో ఒక రోజు ఒక కోటి వృక్షార్చన లో భాగంగా అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ నాయకత్వంలో ఆకుపచ్చ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రo మారిందన్నారు.

 Telangana Is A Green State Under The Leadership Of Cm Kcr, Greenary, Harita Hara-TeluguStop.com

కెసిఆర్ ఆదేశానుసారం స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ఒక కోటి వృక్షాక్షన లో భాగంగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు.తెలంగాణ భూభాగంలో 33 శాతం మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో

సీఎం కెసిఆర్ 2015 జూలై 3 న హరితహరం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

తెలంగాణలో సమృద్ధిగా వానలు కురుసెందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా వానలు వాపస్ రావలే అనే నినాదంతో తెలంగాణకు హరిత హరం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.ఇప్పటి వరకు తొమ్మిది విడతలో హరిత హరం కార్యక్రమంలో మొక్కలను నాటడం జరిగిందన్నారు.

పట్టణాలు, గ్రామాలలో పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రవ్వ బాబు, జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, అడిషనల్ డిఆర్డీవో మదన్, ఎంపిడిఓ శ్రీధర్, సర్పంచ్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube