సీఎం కెసిఆర్ నాయకత్వంలో ఆకుపచ్చ రాష్ట్రంగా తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవంలో భాగంగా శనివారం వేములవాడ మండలం చంద్రగిరి గ్రామంలో ఒక రోజు ఒక కోటి వృక్షార్చన లో భాగంగా అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ నాయకత్వంలో ఆకుపచ్చ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రo మారిందన్నారు.

కెసిఆర్ ఆదేశానుసారం స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ఒక కోటి వృక్షాక్షన లో భాగంగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు.

తెలంగాణ భూభాగంలో 33 శాతం మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో సీఎం కెసిఆర్ 2015 జూలై 3 న హరితహరం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

తెలంగాణలో సమృద్ధిగా వానలు కురుసెందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా వానలు వాపస్ రావలే అనే నినాదంతో తెలంగాణకు హరిత హరం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

ఇప్పటి వరకు తొమ్మిది విడతలో హరిత హరం కార్యక్రమంలో మొక్కలను నాటడం జరిగిందన్నారు.

పట్టణాలు, గ్రామాలలో పెద్ద ఎత్తున సామాజిక అడవుల పెంపకం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రవ్వ బాబు, జడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, అడిషనల్ డిఆర్డీవో మదన్, ఎంపిడిఓ శ్రీధర్, సర్పంచ్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రలో లేని విధంగా భారీ ఫ్యాన్ వార్స్..?