దొంగతనం కేసులో ఒకరికి జైలు శిక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ హిమబిందు( himabindu ) మంగళవారం తీర్పును వెలువరించారు.ప్రాసిక్యూషన్ కథనం.

 One Jailed In Theft Case , Theft Case-TeluguStop.com

మేరకు 31 మే, 3 జూలై 2023 లో సిరిసిల్ల పట్టణానికి చెందిన వొడ్నాల రవి కిరణ్, ఎనగందుల శ్రీకాంత్ లు తమ సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం చోరీ జరిగిందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన తంగల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, కేసులో పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ హిమబిందు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.కోర్టులో సరైన సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube