దొంగతనం కేసులో ఒకరికి జైలు శిక్ష
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి మేజిస్ట్రేట్ హిమబిందు( Himabindu ) మంగళవారం తీర్పును వెలువరించారు.
ప్రాసిక్యూషన్ కథనం.మేరకు 31 మే, 3 జూలై 2023 లో సిరిసిల్ల పట్టణానికి చెందిన వొడ్నాల రవి కిరణ్, ఎనగందుల శ్రీకాంత్ లు తమ సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం చోరీ జరిగిందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన తంగల్లపల్లి మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, కేసులో పూర్వపరాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ హిమబిందు నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.
కోర్టులో సరైన సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 5, మంగళవారం2024