నేలపై సందడి చేస్తున్న ఆరుద్ర పురుగులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :తొలకరి చినుకు.ఆరుద్ర మెరుపు ఆరుద్ర కార్తె ( , Arudra Karthe)పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే.

 Trombidiidae Buzzing On The Ground ,trombidiidae , Arudra Karthe , Mrigasira-TeluguStop.com

వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.వర్షాలు( Rains) కురుస్తుండడంతో ఈ మృగశిర లేదా ఆరుద్ర కార్తె లోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి.

రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి.

అన్నదాతలకు మేలు చేసే పర్యావరణ నేస్తాలు ఇవి.ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్దవారికి, 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏమిటో, అవి తీసుకొచ్చే సమాచారం ఏమిని స్పష్టంగా తెలుసు.

ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి.ఏ రైతూ వీటిని చంపడు.ఎవ్వరినీ చంపనీయడు.దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.

కొలుస్తారు.అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు కురిసి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి.

ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube