ఫ్యాషన్ సినిమా( Fashion ) మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం.బయట ప్రపంచానికి తెలియని మోడలింగ్ రంగంలోని అనేక విషయాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమా చూపించింది.ప్రపంచం నివ్వరబోయే ఈ వాస్తవాలను చూసి చాలామంది దడుచుకున్నారు కూడా.
ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా మరియు కంగనా రనౌత్( Kangana Ranaut ) లకు ఉత్తమ జాతీయ పురస్కారాలు కూడా అందాయి.వీరిద్దరూ ఒకటితో ఒకరు పోటీపడి మరి నటించారు.
ఇక షోనాలి పాత్రలో కంగనా నటించిన ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఆమె వేసుకున్న బట్టలు ఒక్కసారిగా ఊడిపోవడం మనమందరం చూసాం.
సినిమాలో ఆ సీన్స్ ఉన్నది ఉన్నట్టుగా చూస్తే జనాలు ఇబ్బంది పడతారు అని బ్లర్ చేశారు.అయితే అలా బట్టలు ఊడిపోయిన, ఆమె గుండె భాగం అందరూ చూసినా కూడా కంగనా రనౌత్ ఎలాంటి భయం, బెరుకు లేకుండా మళ్ళీ తన డ్రెస్ ని సరి చేసుకుని అంతే కాన్ఫిడెన్స్ తో ర్యాంప్ వాక్ పూర్తి చేస్తుంది.వాక్ పూర్తయిన తర్వాత తన రూమ్ కి వెళ్లి కంగనా బోరున వినిపిస్తుంది.
అయితే ఈ సీన్ డైరెక్టర్ గొప్పతనం ఏమీ కాదు 2006లో ఇది ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించింది.ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఒక మోడల్ వేసుకున్న డ్రెస్ అలాగే ఉన్నట్టుండి తగ్గిపోయి ఆమె యదభాగం పూర్తిగా రివీల్ అయిపోతుంది.
దాన్ని చూసిన ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.ఆ మోడల్ పేరు కారల్ గ్రేసియాస్( Carol Gracias )అయితే ఉన్నపలంగా జరిగిన ఈ సంఘటనతో కారల్ ఏమాత్రం భయపడకుండా డ్రెస్ అదిమి పట్టుకుని వాక్ పూర్తి చేసుకుని బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది.
ఈ విషయం అప్పట్లో మామూలుగా సెన్సేషన్ అవ్వలేదు.నిర్వాహకులు కావాలనే ఇలా చేశారని అందరూ మండిపడ్డారు.దీనిపై మహారాష్ట్ర అసెంబ్లీ( Maharashtra Assembly )లో కూడా తీవ్రమైన చర్చలు జరిగాయి.దాంతో కోర్టులో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కేసు వేయడంతో ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది.
ఆ తర్వాత మోడల్స్ భద్రత గురించి అలాగే ఆర్గనైజర్స్ ఎంత వరకు శ్రద్ధ తీసుకోవాలని ఒక రూల్ కూడా వచ్చింది.ఇలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు కచ్చితంగా లైట్స్ ఆఫ్ చేయాలనే రూల్ కూడా పెట్టారు అలాగే మోడల్స్ ధరించే దుస్తులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఒక నియమం పెట్టారు.2008లో మధుర్ బండార్కర్ ఫ్యాషన్ సినిమాలో ఈ సీన్లు పెట్టి అందరికీ ఫ్యాషన్ ప్రపంచం గురించి అనేక సంచలన విషయాలను బయటపెట్టారు.