ఆలయం బయటే చెప్పులు వదిలేసిన విదేశీయురాలు.. వీడియో చూస్తే ఫిదా..

సాధారణంగా మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచి వెళ్తాం.ఈ సంస్కృతి గురించి ఫారినర్స్‌కి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఒక పోలిష్ డిజిటల్ క్రియేటర్ అయిన అలెగ్జాండ్రా పెకల( Aleksandra Pekala ) ఈ భారతీయ సంస్కృతిని పాటించి భారతీయుల హృదయాలను కొల్లగొట్టింది.

 A Foreigner Left Her Sandals Outside The Temple, Aleksandra Pekala, Digital Cre-TeluguStop.com

ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా అలెగ్జాండ్రా భారతీయ ఆచారాలు, నమ్మకాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది.

అలెగ్జాండ్రా భారతీయ ప్రజలలో ఉన్న ఈ సాధారణ ఆచారాన్ని వివరిస్తుంది.మందిరాలు లేదా ఇళ్లలోకి ప్రవేశించే ముందు చెప్పులు విడవడం ఆ ప్రదేశాలపై గౌరవం చూపడానికి సంకేతం అని ఆమె తెలిపింది. దేవాలయాలలో( Temples) దైవ శక్తి నివసిస్తుందని ప్రజలు నన్ను ఇలా చేస్తారని ఆమె వివరించింది.

ఈ వీడియోలో, అలెగ్జాండ్రా ఒక అద్భుతమైన నిర్మాణ శైలితో ఉన్న మందిరానికి అడుగు పెట్టే ముందు గౌరవంగా తన చెప్పులను తీసివేస్తుంది.ఈ టెంపుల్ పేరు తెలియదు, కానీ ఈ వీడియోలో “రోజా” పాట వినిపించింది.

దీనికి 600,000కు పైగా వ్యూస్ వచ్చాయి.

అలెగ్జాండ్రా వీడియోలో భారతదేశాన్ని “భారత్” అని పిలిచింది దాంతో చాలామంది సంతోషించారు.భారతీయ సంస్కృతి( Indian culture)ని అర్థం చేసుకోవడానికి, గౌరవించడానికి ఆమె ప్రయత్నించింది, దీనికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఆమె హిందీ కూడా బాగా మాట్లాడుతుంది.

అలెగ్జాండ్రా భారతదేశంలోని ఇతర ప్రదేశాల గురించి కూడా వీడియోలు చేస్తుంది.ఒక వీడియోలో, రాజస్థాన్‌లోని ఒక గ్రామం గురించి ఆమె మాట్లాడింది, అక్కడ ప్రజలు చిరుతపులితో కలిసి జీవిస్తారని చెప్పింది.

ఆమె భారతదేశం గురించి మరికొన్ని వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.వాటికి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube