టాలీవుడ్ ఇండస్ట్రీలోని డైరెక్టర్లలో నంబర్ వన్, నంబర్ 2, నంబర్ 3 రాజమౌళి( Rajamouli ) అని చాలామంది భావిస్తారు.రాజమౌళికి పోటీనిచ్చే వాళ్లు, సాటిగా నిలిచేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే రాజమౌళిని మించడం ప్రభాస్ కు సాధ్యమా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి( Kalki 2898 AD )తో ప్రభాస్ లెక్కలు మార్చేస్తారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మూవీ ఏదనే ప్రశ్నకు కలెక్షన్లపరంగా ఎవరైనా బాహుబలి2 అని చెబుతారు.అయితే బాహుబలి2 ( Baahubali 2 )కలెక్షన్లను క్రాస్ చేయాలని రాజమౌళి భావించినా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో జక్కన్నకు సాధ్యం కాలేదు.ఈ రికార్డ్ బ్రేక్ కావాలంటే మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ వరకు ఆగాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ఈసారి లెక్కల్ని ఏ స్థాయిలో మారుస్తారో చూడాల్సి ఉంది.
ప్రభాస్ రాజమౌళి కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబినేషన్ లో సినిమా రావడం సులువైన విషయం అయితే కాదనే సంగతి తెలిసిందే.ప్రభాస్ రాజమౌళి కాంబోలో బాహుబలి3( Baahubali 3 ) సినిమా తెరకెక్కితే ఆ సినిమా విజువల్ వండర్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త సంచలనాలను సృష్టించాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 125 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా స్థాయి హిట్లను సొంతం చేసుకోవడంతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండటం గమనార్హం.
రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ప్రభాస్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని భోగట్టా.