నేలపై సందడి చేస్తున్న ఆరుద్ర పురుగులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :తొలకరి చినుకు.ఆరుద్ర మెరుపు ఆరుద్ర కార్తె ( , Arudra Karthe)పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే.

వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.

వర్షాలు( Rains) కురుస్తుండడంతో ఈ మృగశిర లేదా ఆరుద్ర కార్తె లోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి.

రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి.అన్నదాతలకు మేలు చేసే పర్యావరణ నేస్తాలు ఇవి.

ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్దవారికి, 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏమిటో, అవి తీసుకొచ్చే సమాచారం ఏమిని స్పష్టంగా తెలుసు.

ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి.ఏ రైతూ వీటిని చంపడు.

ఎవ్వరినీ చంపనీయడు.దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.

కొలుస్తారు.అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు కురిసి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి.

ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ బాలీవుడ్ హీరోలు పనికిరారు అని రిజెక్ట్ చేసిన రామ్‌ గోపాల్ వర్మ..?