టమాటాలో తెల్ల దోమలను అరికట్టేందుకు చర్యలు..!

టమాటా( Tomato ) పంటను ఆశించే తెల్ల దోమలు దాదాపుగా ఒక సెంటీమీటర్ పొడవు ఉంటాయి.ఈ దోమలకు రెండు జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద, మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది.

 Actions To Prevent White Mosquitoes In Tomato , Tomato, White Mosquitoes, Mosqui-TeluguStop.com

ఈ తెల్ల దోమలు ఆకుల కింది భాగంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.ఈ దోమలు( Mosquitoes ) పొడి మరియు వెచ్చని వాతావరణంలో జీవిస్తాయి.

ఇవి ఆకుల కింద గుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు పసుపు రంగు నుండి తెల్లని రంగులో ఉండి చదువుగా, పాలిపోయిన పచ్చ రంగులో ఉంటాయి.

ఈ తెల్ల దోమలు ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేవు.కాబట్టి కలుపు మొక్కలను నియంత్రిస్తే వీటిని కాస్త నియంత్రణలో పెట్టినట్టే.

తెల్ల దోమలు( White mosquitoes ) మొక్కల కణజాలాన్ని పూర్తిగా తిని తేనె బంకను ఆకులపై, కాండంపై, పండ్లపై విసర్జిస్తాయి.

తెల్ల దోమలను అరికట్టాలంటే పొలంలో పసుపు రంగు జిగురు వలలు అక్కడక్కడ ఏర్పాటు చేయాలి.తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.ఈ తెల్ల దోమలను ఆకర్షించడానికి ఇతర మొక్కలను అంతర పంటగా వేసుకోవాలి.

అరుణకు మొక్కజొన్న, జొన్న ( Maize, sorghum )లేదా సజ్జలు వంటి మొక్కలను సరిహద్దు పంటలుగా వేయాలి.ఏవైన మొక్కలపై గుడ్లు లేదా లార్వాలు కనిపిస్తే ఆ మొక్కలను జాగ్రత్తగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.

పంట కోత తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ తెల్ల దోమలను అరికట్టడానికి కీటక నాశక సబ్బులు, వేప నూనె, వేల గింజల సారం లను ఉపయోగించాలి.

సూక్ష్మ క్రిములైన బెయువేరియా బస్సియన, వెర్టిసిల్లీయం లను ఉపయోగించాలి.రసాయన పద్ధతిలో ఈ తెల్ల దోమలను అరికట్టాలంటే స్పిరోమెస్పిన్ లేదా అజాడిరక్టిన్, బుప్రోఫెజిన్ లను ఉపయోగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube