టమాటా( Tomato ) పంటను ఆశించే తెల్ల దోమలు దాదాపుగా ఒక సెంటీమీటర్ పొడవు ఉంటాయి.
ఈ దోమలకు రెండు జతల రెక్కలు తెలుపు నుండి పసుపు బూడిద, మైనపు స్రావంతో కప్పబడి ఉంటుంది.
ఈ తెల్ల దోమలు ఆకుల కింది భాగంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి.ఈ దోమలు( Mosquitoes ) పొడి మరియు వెచ్చని వాతావరణంలో జీవిస్తాయి.
ఇవి ఆకుల కింద గుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు పసుపు రంగు నుండి తెల్లని రంగులో ఉండి చదువుగా, పాలిపోయిన పచ్చ రంగులో ఉంటాయి.
ఈ తెల్ల దోమలు ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవించలేవు.కాబట్టి కలుపు మొక్కలను నియంత్రిస్తే వీటిని కాస్త నియంత్రణలో పెట్టినట్టే.
ఈ తెల్ల దోమలు( White Mosquitoes ) మొక్కల కణజాలాన్ని పూర్తిగా తిని తేనె బంకను ఆకులపై, కాండంపై, పండ్లపై విసర్జిస్తాయి.
"""/" /
తెల్ల దోమలను అరికట్టాలంటే పొలంలో పసుపు రంగు జిగురు వలలు అక్కడక్కడ ఏర్పాటు చేయాలి.
తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయాలి.ఈ తెల్ల దోమలను ఆకర్షించడానికి ఇతర మొక్కలను అంతర పంటగా వేసుకోవాలి.
అరుణకు మొక్కజొన్న, జొన్న ( Maize, Sorghum )లేదా సజ్జలు వంటి మొక్కలను సరిహద్దు పంటలుగా వేయాలి.
ఏవైన మొక్కలపై గుడ్లు లేదా లార్వాలు కనిపిస్తే ఆ మొక్కలను జాగ్రత్తగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.
పంట కోత తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ తెల్ల దోమలను అరికట్టడానికి కీటక నాశక సబ్బులు, వేప నూనె, వేల గింజల సారం లను ఉపయోగించాలి.
సూక్ష్మ క్రిములైన బెయువేరియా బస్సియన, వెర్టిసిల్లీయం లను ఉపయోగించాలి.రసాయన పద్ధతిలో ఈ తెల్ల దోమలను అరికట్టాలంటే స్పిరోమెస్పిన్ లేదా అజాడిరక్టిన్, బుప్రోఫెజిన్ లను ఉపయోగించాలి.