మహిళా బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీవ్రంగా మండిపడ్డారు.పార్లమెంట్ లో పన్నెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారని కవిత అన్నారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు.సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా అని ప్రశ్నించారు.2010వ సంవత్సరంలో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు 2023 వచ్చినా ఎందుకు పార్లమెంట్ లో ఆమోదం పొందలేదని ఆమె ప్రశ్నించారు.గత పదేళ్లుగా పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.