మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )త్వరలోనే గాండీవ దారి అర్జున( Gandheevadari Arjuna ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ(Suma) వ్యాఖ్యతగా వ్యవహరించారు.ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ( Lavanya Tripati ) ఇద్దరు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నటువంటి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.ఇలా పెళ్లి చేసుకుని జీవితంలో ఒక్కటి కాబోయే దంపతుల మధ్య యాంకర్ సుమ చిచ్చు పెట్టిందని తెలుస్తుంది.ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…యాంకర్ సుమ ఈ కార్యక్రమంలో భాగంగా వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ కాల్ మీ అర్జెంట్ అంటూ నిహారిక( Niharika ) నుంచి అలాగే లావణ్య త్రిపాఠి నుంచి ఒకేసారి మెసేజ్ వచ్చింది మీరు ఎవరికీ కాల్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.
సుమ ఇలా అడగడంతో వరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ తల పట్టుకున్నారు అయితే ఈయన ఆలోచిస్తూ ముందు నా చెల్లె నిహారికకే ఫోన్ చేస్తానని తెలిపారు.ఎందుకంటే నిహారిక చిన్నమ్మాయి కావడంతో ముందు తనకే కాల్ చేస్తానని చెప్పారు.దీంతో సుమ కూడా మీరు చెల్లికే ఫోన్ చేస్తానని చెప్పడంతో మీకు మంచి మార్కులే వేస్తున్నాను.
ఇక మిగిలినది ఇంటికి వెళ్ళాక మీరు చూసుకోండి లావణ్య అంటూ సుమ మాట్లాడడంతో అందరూ నవ్వుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాపం వరుణ్ తేజ్ ను ఇలా ఇరికించావేంటి సుమ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.