ముఖ్యంగా చెప్పాలంటే లవంగాలు( cloves ) మన పోపుల డబ్బాల ఉంటుంది అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇవి వంటకాలలో ఘాటును రుచిని పెంచడంతోపాటు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.అలాగే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు నమ్మలేరు.
అలాగే లవంగాల ఆరోగ్య ప్రయోజనాల( Health benefits ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రోటీన్, కొవ్వు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్స్, విటమిన్ బి కాంప్లెక్స్ లతో సహా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.పరిగడుపున ఒక లవంగాన్ని తింటే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోవడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోయి మౌత్ ఫ్రెషనర్ గా ఇవి పని చేస్తాయి.సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల మీద ఇవి పోరాటం చేస్తాయి.
అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ( immune system ) బలోపేతం చేస్తాయి.అంతే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే లవంగం పరిగడుపున తింటే పళ్ళు, చిగుళ్ళు బలంగా మారుతాయి.ఇంకా చెప్పాలంటే లవంగాలలో యూజీనాల్ అనే రసాయనం ఉంటుంది.ఇది సైనస్ వంటి సమస్యలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రస్తుతం సీజన్ మారింది కాబట్టి ఈ సీజన్ లో సైనస్ సమస్య కూడా వస్తూ ఉంటుంది.
దానికి చెక్ పెట్టడానికి లవంగం ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే అధిక బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.