అదికార పార్టీ లో టికెట్ల లొల్లి అనుకున్నంత స్థాయిలో లేకపోయినా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.తిరుమల లో దర్శనానికి వెళ్ళిన సందర్భంగా మీడియాతో మాట్లాడి ఆయన మెదక్లో తన కుమారుడికి సీటు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం ప్రదాన్యత సంతరించుకుంది .
ముఖ్యం గా బారాశా మూల స్థంబలలో ఒకరైన ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు( Harish Rao ) ని టార్గెట్ చేసిన మైనంపాటి మెదక్ లో ఆయన పెత్తనం ఏమిటి అంటూ నిలదీశారు.మా విషయాలలో వేలు పెడితే మీ అడ్రస్ లు గల్లంతు చేస్తానంటూ హరీష్ రావుకు వార్నింగ్ ఇవ్వడం పార్టీ శ్రేణులను కూడా విస్మయపరిచింది.

హనుమంతరావు వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.కెసిఆర్( CM KCR ) దగ్గర నుండి కల్వకుంట్ల కవిత నుండి బారాశా వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ వరకూ ఆ వ్యాఖ్యలు ఖండించారు అయితే ఆ వాఖ్యల అనంతరం కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థానానికి మైనంపాటిని ( MLA Mynampally Hanumantha Rao )ఖరారు చేయటం కొంత ఆశ్చర్యపరిచింది .అయితే ఆర్థిక బలం అంగ బలం పుష్కలం గా ఉండి సామాజిక వర్గ పరం గానూ బలంగా ఉన్న మైనం పాటి ని తప్పించడం అనవసరమైన పరుణామలకు దారితీస్తుందని భావించిన కేసీఆర్ టికెట్ ఇచ్చి ఉంటారని ఆ భావించారు.

అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా తన కుమారుడి సీటు విషయమై గట్టిగా పట్టు పట్టినట్లు వ్యవహరించడంతో కెసిఆర్ రంగంలోకి దిగి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.టికెట్లు దక్కని నేతలకు భరోసా ఇచ్చేటట్టు మాట్లాడుతూనే డబ్బులు ఉన్నాయని అతిగా ప్రవర్తిస్తే మాత్రం చీరేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు .కేసీఆర్ హెచ్చరికల తర్వాత కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ కుమారుడు రాజకీయ భవిష్యత్తు విషయంలో మాత్రం గట్టి పట్టుదల తోనే ఉన్నట్లుగా తెలుస్తుంది .మరి ఇచ్చిన ఒక టిక్కెట్ ను మైనం పాటి అంగీకరిస్తారా లేక ఇతర పార్టీల్లో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటారో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనాకు రావచ్చు
.