తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల్లో అలీ( Ali ) ఒకడు ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన చేసిన చాలా సినిమాల తో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.నిజానికి ఈయన చేసిన సినిమాలు వరుసగా సక్సెస్ లు అవ్వడం తో కమెడియన్ ( Comedian )గా తెలుగు లో సూపర్ గా పాపులర్ అయ్యాడు.
మధ్యలో హీరో గా కూడా కొన్ని సినిమాల్లో నటించి మంచివిజయాలను అందుకున్నాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సాఫీగా సాగిన అలీ సినిమా కెరియర్ ప్రస్తుతం అంత బాగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఆయన నేను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ని అని చెప్పుకుంటూ ఇండస్ట్రీ లో కాలం గడిపిన అలీ తన ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పెట్టిన పార్టీ లో కాకుండా వైసీపీ పార్టీ లో చేరడం నిజంగా పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడిచినట్టే అని చాలా మంది అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.
ఇక వైసీపీ వాళ్ళు ఎదో పదవి ఆశ చూపించడం తో ఆ పార్టీ లోకి వెళ్లిన అలీ ని ఇప్పుడు అసలు అక్కడ ఎవ్వరు పట్టించుకోవడం లేదనేది వాస్తవం…ఇక దానికి తోడు అలీ ఆ పార్టీ లో చేరకముందు పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ఒక మంచి పాత్ర పోషిస్తూ ఉండేవాడు.కానీ ఇప్పుడు ఆలా కుదరడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని కాదని వేరే పార్టీ లోకి పోయిన అలీ ని పవన్ కళ్యాణ్ మళ్లీ తన సినిమాల్లోకి తీసుకుందాం అనుకున్న కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం అది ఒప్పుకోవడం లేదు.
అయితే ఇప్పుడు అలీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవు లాగా తయారైంది అని అందరు అంటున్నారు.అటు రాజకీయంగా అలీ కి అనుకున్న పదవి దక్కలేదు.ఇక దానికి తోడు అలీ సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు.
అందుకే కెరియర్ మంచి టైం లో ఉన్నప్పుడు ఇలాంటి డిసీజన్స్ తీసుకోవద్దు అంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటారు.ఇంకా కొంత మంది అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి మనిషిని మోసం చేసినందుకు అలీ కి ఇలా జరగాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.