ఓటరు అవగాహనపై ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ సామాన్యుల చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటని తెలిపారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు.తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు.
వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో చేరికలు, తీసివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఓటర్ల జాబితా పర్యవేక్షణకు స్థానికంగా కమిటీలు వేయాలని సూచించారు.
ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పార్టీలో ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆమె కోరారు.