ఇటీవలే కాలంలో స్పష్టత లేని అనుమానాలతో తమ కుటుంబాలను తామే నాశనం చేసుకునే వారి సంఖ్య రోజుకు పెరుగుతూ, అభం శుభం తెలియని పిల్లలను అనాధలుగా రోడ్డున పారేస్తున్నారు.కోపతాపాలను పక్కనపెట్టి కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి.
అలా కాకుండా మనసులో అనుమానం అనే విత్తనం నాటుకుంటే చివరికి ఆ అనుమానమే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో( Suspecting Wife ) ఉన్మాదిలా మారి నానా రచ్చ చేసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను భయాందోళనకు గురిచేసిన ఘటన కర్నూలు జిల్లా( Kurnool )లోని దేవనకొండలో గురువారం చోటు చేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.
బనగానపల్లి మండలం పెద్దరాజు పల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు, అనిత లకు 14 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు సంతానం.
ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఐదేళ్ల క్రితం అనిత తన పిల్లలను తీసుకొని దేవనకొండలోని తల్లి వద్దకు వచ్చింది.తల్లి వద్దనే ఉంటూ ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.

అయితే గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా అరసాని రాజు ఒక చేతిలో పురుగుమందు డబ్బా, మరో చేతిలో వేట కొడవలి తీసుకుని భార్య అనిత ఇంటికి వచ్చాడు.రాజు తీరు చూసి భార్య అనిత పెద్ద కుమారుడు భయపడి దూరంగా వెళ్లిపోయారు.వెంటనే రాజు ఇంట్లోకి ప్రవేశించి చిన్న కుమారుడు ఉజ్వేల్ (4) కు బలవంతంగా పురుగుమందు తాగించాడు.
ఆ గ్రామంలోని వీధులలో ఓ ఉన్మాదిలా తిరుగుతూ కలిసి జీవిద్దామని తన భార్యకు ఎన్నిసార్లు చెప్పిన వినలేదని, తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం( Illegal Affair ) పెట్టుకుందని అరుస్తూ తాను కూడా పురుగుమందు తాగి కుప్పకూలిపోయాడు.
వెంటనే స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోని ఇద్దరు ప్రాణాలు విడిచారు.పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.