Mahesh Babu Jr Ntr :మహేష్, జూ.ఎన్టీఆర్ జీవితాలు ఒకేలా గడుస్తున్నాయా.. ఈ ఆసక్తికర విషయం తెలిస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మహేష్ ఇంట కొంత కాలం క్రితం ఒక విషాదం చోటు చేసుకుంది.

 Mahesh Babu V S Jr Ntr Lives-TeluguStop.com

మహేష్‌కి ఆప్తులైన కొంతమంది వ్యక్తులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు.మొదట మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య కారణాల వల్ల కన్నుమూసారు.

ఇక మహేష్ తల్లి శ్రీమతి ఇందిరా దేవి కూడా అనారోగ్య సమస్యలతో మరణించారు.

Telugu Indira Devi, Jr Ntr, Krishna, Mahesh Babu, Nandamurihari, Tollywood, Triv

కాగా ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారింది.జూనియర్ ఎన్టీఆర్( Jr mtr ) జీవితంలో జరిగిన సంఘటనలే మహేష్ జీవితంలో కూడా జరుగుతున్నాయి అంటూ చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం లోకి వెళ్తే 2014 లో ఎన్టీఆర్ సోదరుడు జానకి రామ్ మరణించారు.

ఆ సంఘటనను గుర్తు చేసేలా మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా కొన్ని నెలల క్రితమే మరణించారనే విషయం అందరికి తెలిసిందే.ఇక జానకి రామ్ మరణించిన నాలుగేళ్ళకే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరి కృష్ణ( Nandamuri Hari Krishna ) కారు ప్రమాదంలో మరణించారు.

అలానే మహేష్ బాబు అన్న చనిపోయిన కొన్ని నెలలకే అతని తల్లి ఇందిరా దేవి మరణించారు.

Telugu Indira Devi, Jr Ntr, Krishna, Mahesh Babu, Nandamurihari, Tollywood, Triv

హరి కృష్ణ మరణించే సమయానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ‘ సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలో నటించాడు ఎన్టీఆర్.ఆ సినిమా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో ఒక ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఎన్టీఆర్ తన 28వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో, 29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో నటించాడు.సేమ్ అలానే మహేష్ బాబు కూడా తన 28వ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో,29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

ఇదంతా గమనించిన ప్రేక్షకులు ఎన్టీఆర్, మహేష్ లా జీవితాలు ఒకటే బాటలో వెళ్తున్నాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube