ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ అనేక రంగాలలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ టెక్నాలజీ ద్వారా రాబోయే రోజుల్లో మనుషుల ఉపయోగం తక్కువైపోతుందని మేధావులు చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికే ఏఐ టెక్నాలజీని.విద్యారంగంలో ఇంకా అనేక ఉపాధి రంగాలలో వాడుతున్నారు.
ఏఐ టెక్నాలజీ ద్వారా ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ఓ యాంకర్ న్యూస్ కూడా చదవడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే ఏఐ టెక్నాలజీని విద్యారంగంలో విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్ విద్యాశాఖను ఆదేశించడం జరిగింది.అధ్యాపకుల కొరత ఇంకా కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుందని స్పష్టం చేయడం జరిగింది.పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలి అని సీఎం జగన్ పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చే రీతిలో విద్యా వ్యవస్థ అవసరాలను విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.అదేవిధంగా కొత్త తరహా సబ్జెక్టులను నెర్చుకునేందుకు కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి తీసుకునే పదో తరగతి సర్టిఫికెట్ ఇంకా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ వాటికి ప్రపంచంలో ఎక్కడైనా విలువ ఉండే రీతిలో లక్ష్యం అని సీఎం జగన్ విద్యాశాఖకు స్పష్టం చేశారు.