విజయ్ దేవరకొండ( Vijay devarkonda ) హీరో గా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఖుషి…ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో.మంచి అంచనాలే ఉన్నాయి నిజానికి ఈ సినిమా కి ముందు విజయ్ కి లైగర్ అనే ఒక భారీ ప్లాప్ ఉంది అలాగే శివ నిర్వాణ కి టక్ జగదీష్ అనే ఒక భారీ ప్లాప్ సినిమా ఉంది ఇక సమంత కి అయితే రీసెంట్ గా శాకుంతలం అనే ప్లాప్ సినిమా ఉంది ఇలా ప్రస్తుతం ముగ్గురు కూడా ప్లాపుల్లోనే ఉన్నారు అందుకే ఖుషి సినిమా మీదనే అందరూ అంచనాలు పెట్టుకున్నారు నిజానికి ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుందో తెలీదు కానీ వీళ్ళ ముగ్గురి భవిష్యత్తు కూడా ఈ సినిమాల మీదనే ఉంది అంటే నమ్మక తప్పదు…ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రెయిలర్ చాలా బాగుంది అనే టాక్ అయితే తెచ్చుకుంది…
కానీ ఈ సినిమా పెళ్లి కి ముందు పెళ్లి తర్వాత ఒక జంట మధ్య జరిగే స్టోరీ గానే అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సెంటిమెంటల్ సినిమాలు కొద్దిపాటి సెంటిమెంట్ వర్క్ అవుట్ అయిన కూడా ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి…అందుకే ఈ సినిమాలకి సక్సెస్ రేట్ ఎక్కువ గా ఉంటుంది నిజానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూడాలి అని విజయ్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…
అయితే ఈ ఒక్క సినిమా హిట్ అయితే ఇక ముగ్గురి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అందుకే ఇక ఇప్పటి నుంచి ఈ సినిమా సక్సెస్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు…ఇక ఈ సినిమా పూర్తి అయితే విజయ్, గౌతమ్ తిన్ననూరి( Gowtam Naidu Tinnanuri ) డైరెక్షన్ లో చేస్తున్న ఒక సినిమా షూటింగ్ మొదలవుతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదు ఇక దీంతో ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది అనేది తెలుస్తుంది.ఖుషి మూవీ హిట్ అయితే విజయ్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి తను నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్న సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది…