జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.పవన్ కు రాజకీయ సిద్ధాంతం లేదని చెప్పారు.
సీఎం జగన్ ను చూసి పవన్ అసూయపడుతున్నారన్న మంత్రి అమర్నాథ్ సీఎంను తిడితే పవన్ నాయకుడిని అవుతానని అనుకుంటున్నట్లున్నారంటూ విమర్శించారు.పవన్ సంసారం బీజేపీతోనన్న ఆయన సహజీవనం టీడీపీతోనని ఎద్దేవా చేశారు.
పవన్ చంద్రబాబు స్క్రిప్ట్ ను చదువుతున్నారన్నారు.పవన్ కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదని విమర్శలు చేశారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని మంత్రి అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.