టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న( Tamannah ) ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా ఈమె నటించిన రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి.
ఆగస్టు 10వ తేదీ రజినీకాంత్ ( Rajinikanth ) జైలర్( Jailer ) విడుదల కాగా 11వ తేదీ చిరంజీవి( Chiranjeevi ) భోళా శంకర్( Bhola Shankar ) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తమన్న కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్న తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక ఈ మధ్యకాలంలో తమన్నా కాస్త బోల్డ్ సన్నివేశాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విషయం గురించి తమన్నాను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.సినిమా ఇండస్ట్రీలో మార్పు అనేది ఎంతో ముఖ్యం.ఇలా మన ఆలోచన ధోరణిలో మార్పులు రాకపోతే మనం ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉంటామని తెలిపారు.అలా ఆగిపోవాలని ఎవరు అనుకోరు కెరియర్ లో ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.
ఒక ఉద్యోగంలో ప్రమోషన్లు ఎలాగో ఉంటాయో మా ఉద్యోగంలో కూడా అంతే అయితే కొన్నిసార్లు కాస్త బ్రాడ్ గా ఆలోచించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక ఈమె విజయ్ వర్మ( Vijay Varma ) తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమన్నను పెళ్లి ( Marriage ) గురించి కూడా ప్రశ్నించగా ఆమె పెళ్లి గురించి ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
పెళ్లి గురించి ఏమైనా ప్లాన్ చేశారా అన్న ప్రశ్న తమన్నకు ఎదురు కావడంతో ప్రస్తుతానికైతే పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ చేయలేదని తెలిపారు.తాను ప్లాన్ చేసినప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా అందరితోనూ పంచుకుంటానని ఈ సందర్భంగా తమన్న పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.