రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల ఆదర్శ సంక్షేమ సంఘం దగ్గర ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం తో దోమల బాధ తీవ్రంగా ఉందని కాలనీ వాసులు పిర్యాదు చేయగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు మురికి నీటి గుంటను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కాలనీ వాసుల తో కలిసి పరిశీలించారు.
శనివారం పంచాయతీ కార్యదర్శి దేవరాజ్ ఆధ్వర్యంలో అయిల్ బాల్స్ వేసి దోమల లార్వా నిలవ ఉండకుండా చూస్తానని ఆయన కాలనీ వాసుల తో అన్నారు.
ఆయన వెంట ఆశా వర్కర్ రజిత, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి, యూత్ సభ్యులు రేసు గణేష్, మంగురపు రాజు,గుంటుక రవి,మంగురపు అశోక్,కొప్పెల్లి రమేష్ తదితరులు ఉన్నారు.