రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో ఫ్రైడే సందర్భంగా డ్రై డే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మండల వైద్యాధికారి వేణుగోపాల్ ఇంటింటికి తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నీళ్లు నిలువ లేకుండా ఉంచుకోవాలని సూచించారు.
అలాగే ఆరోగ్య ఉప కేంద్రం స్థలాన్ని పరిశీలించడం జరిగింది.
ఇట్టి భవన నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రమేష్, ఉప సర్పంచ్ శివరాత్రి నరసయ్య, వార్డు నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్,హెల్త్ సూపర్వైజర్లు ఫయాజ్, సువార్త మేడం ఏఎన్ఎం పద్మావతి, ఆశ కార్యకర్త సప్న,అంగన్వాడి కార్యకర్త భారతమ్మ, ఫీల్డ్ వర్కర్ గుండెల్లి రాజు పాల్గొన్నారు.