వీడియో వైరల్: డిగ్రీ పట్టా పుచ్చుకునేందుకు వెరైటీగా వెళ్లిన స్టూడెంట్.. చివరకు..?!

డిగ్రీ పట్టా( Degree ) తీసుకునేటప్పుడు విద్యార్థులు ఆనందపడుతూ ఉంటారు.మూడు, లేదా నాలుగేళ్లు కష్టపడి చదివిన తర్వాత పరీక్షల్లో పాస్ అయి పట్టా వస్తే కలిగే ఆనందం వేరే.

 Student Dances While Receiving Degree On Stage Details, Student, Viral Latest, N-TeluguStop.com

విద్యార్థుల జీవితంలో ఇవొక మర్చిపోలేని అనుభూతులు అని చెప్పవచ్చు.డిగ్రీ పట్టా తీసుకునేటప్పుడు అందరూ ఆనందంగా ఫీల్ అవుతారు.

అందరి చప్పెట్ల మధ్య స్టేజ్ మీదకు వెళ్లి పట్టా అందుకుంటారు.కొంతమంది విద్యార్థులు ఇలాంటి సమయంలో భావోద్వేగానికి గురవుతూ ఉంటారు.

అయితే తాజాగా ఒక విద్యార్థి( Student ) డిగ్రీ పట్టా తీసుకునే సమయంలో అందరినీ ఆశ్చరపరిచే పని చేశాడు.కాలేజీ స్నాతకోత్సవం రోజున డిగ్రీ పట్టాలు ఇస్తుండగా.పేరు పిలవగానే విద్యార్థి వేదికపైకి వెళ్లాడు.ఆ తర్వాత డిగ్రీ పట్టా అందుకుంటూ ఆనందంలో వేదికపై డ్యాన్స్( Dance ) వేశాడు.అంతేకాదు వేదికపైకి వెళుతూ కూడా డ్యాన్స్ వేసుకుంటూ అధ్యాపకుల దగ్గరకు వెళ్లాడు.ఇతడి తీరును చూసి అందరూ నవ్వుకున్నారు.

ఇక అధ్యాపకులైతే అతడిపై మండిపడ్డారు.సందర్బానికి తగ్గట్లు ప్రవర్తించాలని, హుందుగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు నీకు సర్టిఫికేట్ ఇవ్వమంటూ అధ్యాపకులు చెప్పారు.దీంతో యువకుడు షాక్ కు గురయ్యాడు.

నర్సి మాంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఇటీవల జరిగిన స్నాతకోత్సవం రోజున ఈ ఘటన జనరిగింది.కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో( Social Media ) పెట్టడంతో వైరల్ గా మారింది.కొంతమంది నెటిజన్లు దీనిని చూసి నవ్వుకుంటుండగా.మరికొందరు యువకుడి తిక్క కుదిరిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.సంతోషాన్ని వ్యక్తపరిచేందుకు డ్యాన్స్ వస్తే తప్పేంటని కొంతమంది అంటుండగా.అధ్యాపకుల ముందు హుందాగా ఉండాలని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

స్నాతకోత్సవం రోజు విద్యార్థిపై అధ్యాపకులు ఇలా చేయడం సరికాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలా నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ యువకుడు చేసిన పని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మాిరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube