యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో యాక్షన్ మూవీస్ ను లైన్లో పెడుతున్నాడు.మరి ఈయన లైనప్ లో ఉన్న సినిమాల్లో ”స్కంద” ( Skanda )ఒకటి.
ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ ఎంత ఎనర్జీతో ఉంటాడో అందరికి తెలిసిన విషయమే.
మరి అలాంటి రామ్( Ram Pothineni ) సరసన అంతకంటే ఎనర్జీతో మెప్పించే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడంతో అందరి కళ్ళు ఈ సినిమా మీద ఉన్నాయి.ఈ ఎనర్జిటిక్ జంటను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసారు.”నీ చుట్టూ చుట్టూ’‘ అనే ఫస్ట్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.
ఈ సాంగ్ ప్రోమో మొన్న రిలీజ్ కాగా అందులో రామ్ ఇంకా శ్రీలీల( Sreeleela ) ఆశ్చర్య పరిచే విధంగా ఉండగా ఇప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఇక ఈ సాంగ్ లో అయితే ఈ జంట మరింత ఎనర్జిటిక్ గా అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టు కున్నారు.ఇక ఈ సాంగ్ కూడా ఫ్రెష్ అండ్ స్టైలిష్ బీట్స్ తో పాటు కొరియోగ్రాఫర్ కొత్త స్టెప్పులతో మరింత ఆకట్టుకుంది.
ఇక డ్యాన్స్ మూమెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో ఏ హీరో చేయని విధంగా ఉన్నాయి.దీంతో రామ్ వేసే స్టెప్పులు డాన్స్ లవర్స్ ను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.
శ్రీలీల కూడా రామ్ ఎనర్జీని మ్యాచ్ చేసింది.ఇక ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.