సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారు.ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఆమె బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె ఇవాళ మధ్యాహ్నం బీజేపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
వైఎస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడిన జయసుధ రాజకీయాలకు దూరమైయ్యారు.తాజాగా బీజేపీలో చేరాలని భావిస్తోన్న జయసుధ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.