మణిశర్మ ( Mani Sharma ) వారసుడిగా స్వర ప్రపంచంలో అడుగుపెట్టాడు మహతి స్వర సాగర్( Mahathi Swara Sagar ) .ఛలో, భీష్మ చిత్రాలకు మహతి ఇచ్చిన పాటలు మార్మోగాయి.
ఈ సినిమాలకు ఈయన అందించిన సంగీతం కారణంగానే చిరంజీవి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది.మెగాస్టార్ చిరంజీవి, తమన్నా(Thamannah) హీరో హీరోయిన్లుగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం భోళాశంకర్ ( Bhola Shankar )ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సైతం భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన.నాన్న పుట్టినరోజు సందర్భంగా మెహర్ రమేష్( Mehar Ramesh ) గారు మా ఇంటికి వచ్చి మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాను మీరే సంగీత దర్శకుడని చెప్పడంతో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను కానీ నిజంగానే ఆయన కథ చెప్పి ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గారితో సినిమా చేసే అవకాశం రావడం అంటే ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషమే కానీ ఆ సమయంలోనే మనపై చాలా బాధ్యత కూడా ఉంటుందని, అది చాలా బరువైన బాధ్యత అంటూ ఈ సందర్భంగా మహతి తెలియజేశారు.
చిరంజీవి లాంటి ఒక గొప్ప హీరోని కలుసుకోవడం నిజంగా ఓ గొప్ప జ్ఞాపకం.ఈ సినిమా కోసం నేను చేసిన తొలి ట్యూన్ ఆయన దగ్గరకు తీసుకెళుతున్నటువంటి ఆ క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.నా సంగీతం విని, ఆయన ఏమంటారా? అనే ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్ వాన్‌లో ట్యూన్ విని చెవుల తుప్పు వదిలిపోయింది.వెల్ డన్ అన్నారు.ఆయన ప్రోత్సాహంతోనే మిగిలిన పాటలన్నింటినీ కూడా పూర్తి చేశాను అంటూ ఈ సందర్భంగా మహతి స్వర సాగర్ చిరంజీవి సినిమా కోసం పనిచేయడం గురించి చెబుతూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.